అరె సమంతలాగే ఉందే..!

సెలబ్రిటీలను పోలిన సెలబ్రిటీలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వారికి సంబంధించిన ఫొటోలను

Updated : 13 Feb 2020 17:06 IST

ఫొటోలతో మెప్పిస్తున్న నటి.. నెటిజన్లు ఫిదా

హైదరాబాద్‌: సెలబ్రిటీలను పోలిన సెలబ్రిటీలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వారికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో వైరల్‌గా మార్చేస్తుంటాం. గతకొంతకాలం క్రితం టాలీవుడ్‌ నటి స్నేహా ఉల్లాల్‌ను చూసి చాలామంది జూనియర్‌ ఐశ్వర్యరాయ్‌ అన్నారు. అయితే తాజాగా కోలీవుడ్ నటి ఆత్మికాకు సంబంధించిన ఫొటోలు చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఎందుకంటే ఆమె అచ్చం సమంతలాగా ఉంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సమంత ఎలా ఉండేవారో అచ్చం అలాగే కనిపిస్తూ నెటిజన్లను మురిపిస్తోంది. ఇటీవల ఆమె.. తన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన చాలామంది  నెటిజన్లు.. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. కొన్ని యాంగిల్స్‌లో ఈ చిన్నది అచ్చంగా సమంతలాగా కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి మీరు ఆమె లుక్‌ను చూసేయండి.

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు