బన్నీ నటుడు కాకపోతే.. ఏం చేసేవారంటే?

టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ నటుడు కాకపోయి ఉండి ఉంటే పియోనో టీచర్‌ కావాలనుకున్నారట. ఇటీవల విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బన్నీ. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించింది. ‘అల..వైకుంఠపురములో..’..

Published : 14 Feb 2020 16:37 IST

పియోనో టీచర్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌, నాసా

హైదరాబాద్‌: ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లుఅర్జున్‌ నటుడు కాకపోతే పియోనో టీచర్‌ కావాలనుకున్నారట. ఇటీవల విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బన్నీ. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించింది. ‘అల..వైకుంఠపురములో..’ చిత్రం సక్సెస్‌ అయిన సందర్భంగా తాజాగా అల్లు అర్జున్‌ను ఓ ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో భాగంగా ‘నటుడు కావాలనే ఆలోచన మీకు ఎప్పుడూ వచ్చింది? ఒకవేళ నటుడు కాకపోతే ఏమయ్యేవాళ్లు?’ అని వ్యాఖ్యాత బన్నీని ప్రశ్నించారు.

‘చిన్నతనంలో నటుడిని కావాలని అసలు అనుకోలేదు. కెరీర్‌ విషయంలో ఒక్కొ సందర్భంలో ఒక్కొలా అనుకోనేవాడిని. కొన్నిసార్లు పియోనో టీచర్‌ అవ్వాలనుకున్నాను. కొన్నిసార్లు మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌, యానిమేటర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌.. ఇలా చాలా అనుకున్నాను. ఒకానొక సమయంలో ‘నాసా’లో పనిచేయాలనుకున్నాను. 18-19 ఏళ్ల వయసు వచ్చేసరికి నటుడు కావాలని ఫిక్స్‌ అయ్యాను.’ అని బన్నీ సమాధానమిచ్చారు.

ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ‘ఆర్య’, ‘ఆర్య2’ చిత్రాల తర్వాత వీరి కాంబినేషనలో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని