నా మొదటి ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మెగాస్టార్‌ తనయుడిగా వెండితెరకు పరిచయమైనా, కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్‌చరణ్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని డ్యాన్స్‌లు, ఫైట్‌లతో మాస్‌

Published : 18 Feb 2020 14:07 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ తనయుడిగా వెండితెరకు పరిచయమైనా, కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్‌చరణ్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని డ్యాన్స్‌లు, ఫైట్‌లతో మాస్‌ కథానాయకుడిగా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉండే చెర్రీ తాజాగా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. చరణ్‌తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా తన అత్తయ్యతో కలిసి ఫొటో దిగారు.

‘నా మొదటి ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్‌ యూ అమ్మా..’ ఇన్‌స్టాలో రామ్‌చరణ్‌

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. దీంతో పాటు, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని