అతడితోనే నా పెళ్లి: అనుష్క

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల సినిమాలంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. తమ అభిమాన నటుల పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు.

Updated : 24 Feb 2020 09:54 IST

ముంబయి: సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల సినిమాల విషయంలో అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. వారి పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్స్‌ చాలా మందే ఉన్నారు. హీరోయిన్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదట వరుసలో ఉండేది మన స్వీటీ అనుష్క అనడంలో సందేహం అవసరం లేదు. గతంలో ప్రభాస్‌ను ఈ భామ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసినా తర్వాత ఆమె పెళ్లి గురించి ప్రచారం గుసగుసలు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా ఆమె తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె పలు విషయాలు అభిమానులతో పంచుకుంది. ‘నేను పెద్దవాళ్లు చూపించిన వాడినే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. నేను ప్రేమలో ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అవి నాకు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు’ అని పేర్కొంది. అనుష్క మూగ అమ్మాయిగా నటించిన ‘నిశ్శబ్దం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని