బరువు తగ్గిన భళ్లాలదేవ

భళ్లాలదేవ బరువు తగ్గాడు. బాహుబలిలో భారీకాయంతో భళ్లాలదేవ పాత్ర పోషించిన రానా.. తన తర్వాతి సినిమా అరణ్యలో అందుకు పూర్తి భిన్నంగా, బక్కపలచగా కనిపించనున్నాడు. రాజమౌళి క్రియేషన్‌లో దాదాపు 110 కిలోలకు పైగా బరువు

Published : 25 Feb 2020 23:44 IST

హైదరాబాద్‌: భళ్లాలదేవ బరువు తగ్గాడు. బాహుబలిలో భారీకాయంతో భళ్లాలదేవ పాత్ర పోషించిన రానా.. తన తర్వాతి సినిమా అరణ్యలో అందుకు పూర్తి భిన్నంగా, బక్కపలచగా కనిపించనున్నాడు. రాజమౌళి క్రియేషన్‌లో దాదాపు 110 కిలోలకు పైగా బరువు పెరిగి ఆ సినిమా తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాడు. ఆ మధ్య రానా బరువుపై పలు రకాల పుకార్లు కూడా వచ్చాయి. అయితే ‘అరణ్య’లో పాత్ర కోసమే తన శరీరాకృతి మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాగా వర్కవుట్లు చేసి దాదాపు 30 కిలోలకు పైగా బరువు తగ్గాడు. ఈ చిత్రంలో అడవిని రక్షించే ఓ ఆదివాసిగా కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ‘కాడన్‌’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే రానా లుక్‌ విడుదల చేసింది. అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈరోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని