‘ఫైటర్‌’లో అనన్య పాత్ర అదేనట 

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన నటి అనన్యపాండే. ప్రస్తుతం ఆమె కథానాయికగా విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకు పరిచయం కానున్నారు...

Published : 26 Feb 2020 22:02 IST

మీడియాతో పంచుకున్న బాలీవుడ్‌ నటి 

హైదరాబాద్‌: ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన నటి అనన్యపాండే. ప్రస్తుతం ఆమె కథానాయికగా విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.  ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అంతేకాకుండా విజయ్‌, అనన్య నటిస్తున్న మొదటి పాన్‌ ఇండియన్‌ సినిమా కూడా ఇదే.

ఇటీవల ఆరంభమైన ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లోకి తాజాగా అనన్యపాండే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనన్యపాండేను ఓ ఆంగ్ల పత్రిక వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా అనన్య ‘ఫైటర్‌’ సినిమాలో తన పాత్ర గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విజయ్‌ దేవరకొండ సినిమాలో నేను నటిస్తున్న పాత్ర నా నిజ జీవితానికి ఎంతో దగ్గర ఉంటుంది. ఎంతోమంది అందమైన, తెలివైన అమ్మాయిలకు నా పాత్రతో సంబంధముంటుందని నేను భావిస్తున్నాను. తెలుగు మాట్లాడేందుకు ఎంతో  ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజూ సెట్‌లో కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను. వీలైనన్ని భాషల్లో స్వతహాగా డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నాను’ అని అనన్యపాండే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని