క్రేన్‌ ప్రమాదంపై శంకర్‌ ట్వీట్‌

ప్రముఖ దర్శకుడు శంకర్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ కాంబినేషల్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు-2’. ఇటీవల ఈ సినిమా సెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఈవీసీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్‌ వేస్తున్న తరుణంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి...

Published : 26 Feb 2020 17:19 IST

నా మీద పడి ఉన్నా బాగుండేది

చెన్నై: ప్రముఖ దర్శకుడు శంకర్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ కాంబినేషల్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు-2’. ఇటీవల ఈ సినిమా సెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఈవీసీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్‌ వేస్తున్న తరుణంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడటం వల్ల శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌ మృతి చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా శంకర్‌ ట్విటర్‌ వేదికగా క్రేన్‌ ప్రమాదంపై స్పందించారు. ప్రమాదం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ఆ ప్రమాదం ఏదో తనకే జరిగి ఉంటే బాగుండేదంటూ పేర్కొన్నారు. 

‘ఎంతో దుఖంతో ఈ ట్వీట్‌ చేస్తున్నాను. నేను ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నాను. ఆ ప్రమాదంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇతర సిబ్బందిని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిద్రలేని రాత్రులను గడుపుతున్నాను. త్రుటిలో క్రేన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఆ క్రేన్‌ నా మీదే పడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. సదరు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.’ అని శంకర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని