అతనితో సరితూగాలంటే.. 4 కుర్చీలు కావాలి

అయాన్‌ముఖర్జీ దర్శకత్వంలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్ర్త. షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటోంది. ఇందులో భాగంగా బుధవారం అమితాబ్‌ షూటింగ్‌లో పాల్గొని సందడి చేశారు.

Published : 26 Feb 2020 21:56 IST

ముంబయి: అయాన్‌ముఖర్జీ దర్శకత్వంలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్ర్త. షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటోంది. ఇందులో భాగంగా బుధవారం అమితాబ్‌ షూటింగ్‌లో పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు రణ్‌బీర్ కపూర్‌, అలియా భట్‌ నటించగా కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా అమితాబ్‌ తాను షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 
‘నా అభిమాన నటుడు రణ్‌బీర్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. 
అతను ఎంతో సత్తా ఉన్న నటుడు. అతనితో సరితూగాలంటే నాకు 4 కుర్చీలు కావాల్సి వచ్చింది’ అని ట్వీటారు.
ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందు రానుంది. కాగా ఆయన నటించిన ‘ఝుండ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని