క్యాస్టింగ్‌ కౌచ్‌పై వరలక్ష్మి ఘాటు వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్‌ కౌచ్‌కి అమ్మాయిలు నో చెప్పడం నేర్చుకోవాలని ఆమె అన్నారు. తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యను ఎదుర్కొన్నానని గతకొంతకాలం క్రితం వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్పందించిన విషయం తెలిసిందే. కొంతమంది నిర్మాతలు తనని వేరే ఉద్దేశంతో...

Published : 01 Mar 2020 21:51 IST

అలాంటి వాటికి ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి

చెన్నై: క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్‌ కౌచ్‌కి అమ్మాయిలు నో చెప్పడం నేర్చుకోవాలని ఆమె అన్నారు. తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యను ఎదుర్కొన్నానని గతకొంతకాలం క్రితం వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్పందించిన విషయం తెలిసిందే. కొంతమంది నిర్మాతలు తనని వేరే ఉద్దేశంతో కలిశారని ఆమె అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘లైంగికంగా వేధించేవారి గురించి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం మహిళలు నేర్చుకోవాలి.’ అని వరలక్ష్మి చెప్పారు. 

అనంతరం విలేకరి.. అలాంటివారి గురించి చెబితే అమ్మాయిలు తమ అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తుంది కదా అని ప్రశ్నించగా.. ‘అది వాళ్లు ఎంచుకునేదాన్ని బట్టి ఉంటుంది. నేను అలాంటి పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలిగాను. స్టార్‌ కిడ్‌నైనా నాకు కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య ఎదురైంది. సదరు వ్యక్తులు మాట్లాడిన ఫోన్‌ కాల్‌ రికార్డింగ్స్‌ కూడా నా దగ్గర ఉన్నాయి. అలాంటి వాళ్ల సినిమాల్లో నాకు నటించాల్సిన అవసరం లేదనిపించింది. అందుకే అలాంటి ఆఫర్స్‌కు నో చెప్పాను. క్యాస్టింగ్‌ కౌచ్‌కి నో చెప్పానని చాలామంది నన్ను బ్యాన్‌ చేశారు. కానీ ఈరోజు నేను నా కాళ్లపై నిలబడగలిగాను. 25 సినిమాల్లో నటించాను. 25 మంది నిర్మాతలు, దర్శకులతో పనిచేశాను.’ అని వరలక్ష్మి పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts