మార్చిలో మురిపించేందుకు వస్తున్న చిత్రాలివే!

2020లో రెండు నెలలు గడిచిపోయాయి. సంక్రాంతికి బాక్సాఫీస్‌ సందడి భారీగా ఉండగా, ఫిబ్రవరిలో ఒకట్రెండు మెరుపులు తప్ప పెద్దగా చిత్రాలేవీ

Published : 02 Mar 2020 09:39 IST

2020లో రెండు నెలలు గడిచిపోయాయి. సంక్రాంతికి బాక్సాఫీస్‌ సందడి భారీగా ఉండగా, ఫిబ్రవరిలో ఒకట్రెండు మెరుపులు తప్ప పెద్దగా చిత్రాలేవీ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. కాగా, ముచ్చటగా మూడో నెల మార్చిలో మరికొన్ని కొత్త చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆ చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం!

యథార్థం సంఘటనలో పలాస 1978

క్షిత్, నక్షత్ర కీలక పాత్రల్లో కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. గాయకుడు, సంగీత దర్శకుడు రఘుకుంచె ప్రతినాయకుడిగా పాత్ర పోసిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం చెబుతోంది. సుధాస్‌ మీడియా పతాకంపై దయన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పలాస 1978’ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఏం పిట్ట కథ చెప్పబోతున్నారు!

విశ్వంత్‌, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకుడు. గ్రామీణ వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమ కథకు, సస్పెన్స్‌ జోడించి సినిమాను తెరకెక్కించినట్లు పోస్టర్లు, టీజర్‌ చూస్తే  అర్థమవుతోంది. ఈ సినిమా కూడా మార్చి 6నే ప్రేక్షకుల ముందుకు రానుంది.  నటుడు బ్రహ్మాజీ తనయుడు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతుండటం గమనార్హం.

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

న్య బాలకృష్ణన్‌, సిద్ధి ఇద్నానీ, త్రిధా చౌదరి కీలక పాత్రల్లో బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోవాలో జరిగిన ఒక ఘటనలో యువతులు చిక్కుకొని దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేదే చిత్ర కథాంశం. యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంజాయ్‌మెంట్‌ శ్రుతిమించితే జరిగే అనర్థాలను ఈచిత్రం ద్వారా చూపించామని చిత్ర దర్శకుడు బాలు చెబుతున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కాస్త ఘాటుగానే ఉన్నాయి. 

టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ హంగామా!

బాలీవుడ్‌లో ‘బాఘీ’, ‘బాఘీ2’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశాలతో వచ్చిన ఈ చిత్రాలకు కొనసాగింపుగా వస్తున్న తాజా చిత్రం ‘బాఘీ3’. అహ్మద్‌ఖాన్‌ దర్శకుడు.  తొలి రెండు చిత్రాల్లో నటించిన టైగర్‌ ష్రాఫ్ మూడో చిత్రంలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చిన 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఉగాదికి వైలెన్స్‌ చూపించనున్న నాని

టు కథానాయకుడిగానూ అటు నిర్మాతగానూ వెండితెరపై తనదైన ముద్రవేస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన కీలక నటించిన చిత్రం ‘వి’. సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు సంవత్సరాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాని ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. మరి వెండితెరపై నాని పాత్ర ఎలా ఉంటుదో చూడాలి. 

‘ఒరేయ్‌ బుజ్జిగా’ అంటున్న రాజ్‌ తరుణ్‌

రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఉగాది కానుకగా, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

భారీ బడ్జెట్‌తో మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’

వైవిధ్యమైన కథలను,  పాత్రలను ఎంచుకుంటూ యువ కథానాయకులకు దీటుగా ముందుకు సాగుతున్న మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. ఆయన కథానాయకుడిగా ప్రియదర్శన్‌ దర్శకత్వంతో తెరకెక్కిన హిస్టారికల్‌ చిత్రం ‘మరక్కర్‌: లయ్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సి’. ఇప్పటివరకూ మలయాళంలో ఇంత భారీ బడ్జెట్‌తో మరే చిత్రమూ రాకపోవడం గమనార్హం. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నారు. తమిళంలో విడుదల చేసేందుకు  సన్నాహాలు చేస్తుండగా, తెలుగులో విడుదల చేయటంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మార్చి మొదటి వారం, చివరి వారంలో సినిమాల విడుదలపై స్పష్టత రాగా, పరీక్షల నేపథ్యంలో మార్చి రెండు, మూడు వారాల్లో విడుదల కావాల్సిన సినిమాలపై స్పష్టత రాలేదు. మరి రెండు వారాల పాటు ఏయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts