బన్నీని ‘బే’ అంటున్న అర్హ

టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ను ఆయన కుమార్తె అర్హ సరదాగా ‘బే’ అని పిలిచారు. ఆ చిన్నారి ముద్దుముద్దుగా ‘బే’ అని పిలుస్తుంటే బన్నీ మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో బన్నీ-అర్హ ఇష్టమైన కలర్‌ గురించి చర్చించుకుంటున్నారు. 

Updated : 02 Mar 2020 11:54 IST

క్యూట్‌ వీడియో పోస్ట్‌ చేసిన స్టైలిష్‌స్టార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ను ఆయన కుమార్తె అర్హ సరదాగా ‘బే’ అని పిలిచారు. ఆ చిన్నారి ముద్దుముద్దుగా ‘బే’ అని పిలుస్తుంటే బన్నీ మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో బన్నీ-అర్హ ఇష్టమైన కలర్‌ గురించి చర్చించుకుంటున్నారు. 

బన్నీ: నీ ఫేవరెట్‌ కలర్‌ ఏంటి బే
అర్హ: పింక్‌ బే
బన్నీ: నన్ను బే అంటావా బే.. (ఆశ్చర్యంగా)
అర్హ: అవును బే (నవ్వుతూ)
బన్నీ: అఁ.. టు టైమ్స్‌ బే అంటావా బే
అర్హ: అవున్‌ బే
బన్నీ: త్రీ టైమ్స్‌.. సొంత ఫాదర్‌ని, కన్నతండ్రిని ఇన్నిసార్లు బే అంటావా బే
అర్హ: అవును బే
బన్నీ: మళ్లీ బే.. నీకు అసలు భయం ఉందా బే
అర్హ: లేదు బే
బన్నీ: మళ్లీ బే అంటావా నన్ను..!

ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘తనే నా బే.. ఫాదర్‌డాటర్‌లవ్‌, జస్ట్‌ ఫర్‌ ఫన్‌’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతకొన్నిరోజుల క్రితం ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘రాములో రాములా’ పాటలో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పును ‘దోశ స్టెప్పు’ అంటు అర్హ చెప్పిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ వర్షం కురిపించింది. ఆదివారంతో ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తయ్యింది. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బన్నీకి జంటగా రష్మిక కనిపించనున్నారు.

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని