రాధిక నా తల్లి కాదు కానీ..!

విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఆమె నటించిన ‘వెల్వేట్‌ నగరం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి ఓ తమిళ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పంచుకున్నారు.....

Published : 03 Mar 2020 11:10 IST

ఆమె, నాన్న పెళ్లి చేసుకోవడం సంతోషమే: వరలక్ష్మి

చెన్నై: విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఆమె నటించిన ‘వెల్వేట్‌ నగరం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి ఓ తమిళ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పంచుకున్నారు. ఇతరులు ఏం అనుకున్నా తనకు అనవసరమని, తన జీవితం తన ఆధీనంలో ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

తన తండ్రి శరత్‌ కుమార్‌ భార్య రాధికను ఆంటీ అని పిలవడం గురించి మాట్లాడుతూ... ‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. రాధిక మా అమ్మ కాదు. కానీ మేం చాలా సన్నిహితంగా ఉంటాం. ఆమె, నాన్న పెళ్లి చేసుకుని.. దంపతులుగా సంతోషంగా ఉండటం నాకు ఆనందమే. అంతేకాదు రాధిక ఆంటీ కుమార్తె రయానేకు నాన్న మంచి తండ్రిగా ఉన్నారు’ అని చెప్పారు.

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ.. ‘నా సినీ కెరీర్‌లో కేవలం ఒక్కసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నా. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైనప్పుడు గట్టిగా నో చెప్పండి. వ్యతిరేకిస్తే అవకాశాలు తగ్గి వెనకబడుతాం. అంతేకానీ కెరీర్‌ ఆగిపోదు’ అని వరలక్ష్మి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని