మాస్క్‌లు ఇలా కూడా చేసుకోవచ్చు: ఉపాసన

ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కలవరపెడుతున్న తరుణంలో దాని బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సాధారణ మాస్క్‌లతోపాటు ఎన్‌-95 మాస్క్‌లను వాడుతున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో చాలాచోట్ల మాస్క్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. మాస్క్‌ల కొరతను దృష్టిలో ఉంచుకుని...

Published : 06 Mar 2020 14:34 IST

లక్షణాలున్నప్పుడే మాస్క్‌లు వాడండి

హైదరాబాద్‌: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కలవరపెడుతున్న తరుణంలో దాని బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సాధారణ మాస్క్‌లతోపాటు ఎన్‌-95 మాస్క్‌లను వాడుతున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో చాలాచోట్ల మాస్క్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. మాస్క్‌ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఉపాసన కొణిదెల సోషల్‌మీడియా వేదికగా ఇన్‌స్టెంట్‌ మాస్క్‌ల గురించి ఓ వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా మనకి కానీ మన చుట్టూ ఉన్నవారికి కానీ కరోనా లక్షణాలున్నప్పుడు మాత్రమే మాస్క్‌లను ధరించాలని ఆమె సూచించారు.

‘హాయ్‌ ఆల్‌.. కరోనా గురించి భయం వీడండి. బాధ్యత కలిగిన పౌరుడిగా వ్యవహరించండి. మందుల దుకాణాల్లో మాస్క్‌లు, శానిటైజర్స్‌ సరిగ్గా దొరకడం లేదని చాలా మంది అంటున్నారు. దేశంలో ఎన్‌-95 మాస్క్‌ల కొరత ఉంది. అందరికీ సప్లై చేసేందుకు ఆయా ఫ్యాక్టరీలు ఎంతో వర్క్‌ చేస్తున్నాయి. టిష్యూతో మాస్క్‌లు చేసుకోవడం గురించి ఇటీవల నేను ఆన్‌లైన్‌లో చూశాను. కాబట్టి మాస్క్‌లు ధరించాలని భావించేవారు ఇలా కూడా చేసుకోవచ్చు. మాస్క్‌ను తీసిన వెంటనే బయటపడేయకుండా.. చెత్తబుట్టలో వేయండి. మీకు కానీ, మీ చుట్టూ ఉన్నవారికి కానీ కరోనా లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మాస్క్‌ను ధరించండి’ అని ఉపాసన తెలిపారు. మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని