ట్విటర్‌లో సూపర్‌స్టార్‌ రికార్డు

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో 90 లక్షల ఫాలోవర్స్‌ సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి సినిమా విడుదల సమయానికి టాలీవుడ్‌ స్టార్‌ కోటి అనుచరుల్ని చేరుకుంటారని.....

Updated : 07 Mar 2020 09:07 IST

90 లక్షల ఫాలోవర్స్‌తో...

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో 90 లక్షల ఫాలోవర్స్‌ సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి సినిమా విడుదల సమయానికి టాలీవుడ్‌ స్టార్‌ కోటి అనుచరుల్ని చేరుకుంటారని కామెంట్లు చేస్తున్నారు. 2010 ఏప్రిల్‌లో మహేశ్‌ ట్విటర్‌ ఖాతా ఆరంభించారు. సూపర్‌స్టార్‌ను 9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం 26 మందిని అనుసరిస్తున్నారు. గతంలో కేవలం తన బావ గల్లా జయదేవ్‌ను మాత్రమే అనుసరించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరింది.

‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి హిట్‌ అందుకున్న మహేశ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. మరోపక్క మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో మహేశ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని