ట్వీపల్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మహేశ్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్వీపల్‌కు(ట్విటర్‌ వాడేవారు) ధన్యవాదాలు చెప్పారు. తాజాగా ఆయన ట్విటర్‌ ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య 90 లక్షలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో మహేశ్‌ ట్విటర్‌ వేదికగా తనను అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘నా ఖాతాను ఫాలో అవుతున్న ట్వీపల్‌కు 9 మిలియన్‌ థ్యాంక్స్‌....

Published : 07 Mar 2020 11:43 IST

ట్వీట్‌ చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్వీపల్‌కు(ట్విటర్‌ వాడేవారు) ధన్యవాదాలు చెప్పారు. తాజాగా ఆయన ట్విటర్‌ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 90 లక్షలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌ ట్విటర్‌ వేదికగా తనను అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

‘నా ఖాతాను ఫాలో అవుతున్న ట్వీపల్‌కు 9 మిలియన్‌ థ్యాంక్స్‌. నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ -ట్విటర్‌లో మహేశ్‌బాబు

2010 ఏప్రిల్‌లో మహేశ్‌ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. ఆనాటి నుంచి ఆయన తన కుమార్తె సితార, కుమారుడు గౌతమ్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు నమ్రతతో దిగిన పలు ఫొటోలను కూడా సందర్భానుసారం అభిమానులతో పంచుకుంటున్నారు. వీటితోపాటు ఆయన తన వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేస్తుంటారు. ప్రస్తుతానికి మహేశ్‌ను 9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం 26 మందిని అనుసరిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో  ప్రేక్షకులను అలరించారు మహేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతానికి షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకున్న మహేశ్ కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. విరామం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని