అది అజిత్‌ సంతకం కాదు..!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌ త్వరలో సోషల్‌మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నారంటూ నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఓ నోటీసుపై సదరు నటుడికి చెందిన లీగల్‌ టీం స్పందించారు. ఆ నోటీస్‌లో ఎంత మాత్రం నిజం లేదని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా నోటీస్‌లో ఉన్న సంతకం కూడా అజిత్‌ది కాదని వారు తేల్చి చెప్పారు.

Published : 07 Mar 2020 21:51 IST

ఫేస్‌బుక్‌ ఖాతాపై స్పందించిన లీగల్‌ టీం

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌ త్వరలో సోషల్‌మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నారంటూ నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఓ నోటీసుపై సదరు నటుడికి చెందిన లీగల్‌ టీం స్పందించారు. ఆ నోటీస్‌లో ఎంత మాత్రం నిజం లేదని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా నోటీస్‌లో ఉన్న సంతకం కూడా అజిత్‌ది కాదని వారు తేల్చి చెప్పారు. ఈ మేరకు అజిత్‌కు చెందిన లీగల్‌ టీం శనివారం ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

‘నటుడు అజిత్‌ లీగల్‌ టీంకు చెందిన మేము ఆయన మాట ప్రకారం, ఆయన తరఫున ఈ నోటీసును విడుదల చేస్తున్నాం. త్వరలో తాను సోషల్‌మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నట్లు అజిత్‌ పేర్కొన్న విధంగా శుక్రవారం సోషల్‌మీడియాలో ఓ నోటీస్‌ చక్కర్లు కొట్టింది. లెటర్‌ హెడ్‌తోపాటు, అజిత్‌ సంతకం కూడా నకిలీవే. అది చూసి మేము ఎంతగానో ఆశ్చర్యానికి లోనయ్యాం. ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం.’ అని అజిత్‌ లీగల్‌ టీం పేర్కొంది. 

అంతేకాకుండా అజిత్‌కు ఎలాంటి సోషల్‌మీడియా ఖాతా లేదని, ఆయనకు సోషల్‌మీడియా మీద ఎలాంటి ఆసక్తి లేదని, ఫ్యాన్‌పేజీలను కూడా అతను సపోర్ట్‌ చేయడని లీగల్‌ టీం వెల్లడించారు. గతకొన్ని సంవత్సరాల క్రితం నుంచి అజిత్‌ సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన మీడియా వారికి కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. అలాగే పబ్లిక్‌ ఈవెంట్స్‌కు కూడా దూరంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని