మాటరాని సమయమిది.. మనసులోని భావమిది

బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన పోస్టులతో అభిమానులకు కనువిందు చేయటంతో పాటు హాస్యమూ తెపిస్తుంటాడాయన.

Updated : 09 Mar 2020 20:30 IST

దిల్లీ: బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన పోస్టులతో అభిమానులకు మంచి సందేశాలిస్తుంటారు. సోమవారం ఆయన ట్విటర్‌లో పెట్టిన ఓ పోస్టు అభిమానులకు ఆయన పాత రోజులను గుర్తుచేసింది. మోముపై స్వచ్ఛమైన దరహాసం కురిపిస్తూ, గులాబీ రంగు కుర్తాలో ఉన్న ఆయన పాత పసుపు రంగు  కారు పక్కన నిల్చున్న ఫొటోను పోస్టు చేశారు. ఆ ఫొటోకు ‘‘కొన్ని సంతోషకరమైన సందర్భాలు మన నోటి వెంట మాటలు రానివ్వవు. నేను మాత్రం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. అయినా ఏమీ మాట్లాడలేక పోతున్నాను’’ అనే వాక్యాన్ని జతచేశారు. తన కుమారుడు అభిషేక్‌తో ఉన్న మరో ఫోటోను ఆయన పోస్టు చేశారు. అందులో తండ్రి, కొడుకులు ఒకే రకమైన దుస్తులతో సందడి చేశారు. ఈ ఫొటోకు గోవిందా సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌ను అనుకరించేలా ఉన్న‘‘బడే మియా తో బడే మియా, చోటే మియా సుభాన్‌ అల్లా ! ఎప్పుడైతే మీ కొడుకు మీ బట్టలు, ధరించటం మొదలు పెట్టాడో అప్పుడే మీరు అతనికి  స్నేహితుడైపోయారు’’ అనే వాక్యం జోడించారు. అభిషేక్‌ వర్క్‌ గురించి సూచనలు చేసే ఆయన ‘‘బాబ్‌ విశ్వాస్‌ ప్రాజెక్టు గురించి ఎలా ఉంది? బాగా ఎంజాయ్‌ చేయ్’’ అని రాసుకొచ్చారు బిగ్‌ బీ.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని