అతడితో పెళ్లి.. అనుష్క ఏమందంటే..

నా పెళ్లి విషయాన్ని బయటకు చెప్పకుండా నేనెందుకు దాస్తాను అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయిక అనుష్క. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు కుమారుడిని అనుష్క త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనుష్క స్పందించారు.

Published : 13 Mar 2020 14:12 IST

హైదరాబాద్‌: తన పెళ్లి విషయాన్ని బయటకు చెప్పకుండా తానెందుకు దాస్తాను అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయిక అనుష్క. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడిని అనుష్క త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అనుష్క తాజాగా స్పందించారు. అనుష్క చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలైన సందర్భంగా గురువారం నగరంలో ‘15 ఇయర్స్‌ ఆఫ్‌ అనుష్కశెట్టి’ అనే పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ ఆంగ్ల పత్రికతో అనుష్క ముచ్చటించారు. తన పెళ్లి గురించి తప్పుడు వార్తలు ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.

‘నా పెళ్లి గురించి గత కొన్నిరోజులగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తవం. అలాంటి పుకార్ల వల్ల నేను ఇబ్బందిపడను. నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. బంధాలను ఎవరూ దాచలేరు. అలాగే నా పెళ్లి విషయాన్ని బయటపెట్టకుండా నేనెందుకు దాస్తాను.? ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి ప్రజలు కూడా దీన్ని సున్నితంగానే చూడాలి’ అని అనుష్క తెలిపారు.

‘నా వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు చొరబడితే నాకు నచ్చదు. వివాహం అనేది చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కరిలాగానే అది నాకు కూడా చాలా ముఖ్యమైనది. వివాహం జరిగిన రోజు తప్పకుండా ప్రజలకు తెలుస్తుంది. నాకు సంతోషాన్నిచ్చే విషయాలను బయటకు చెప్పకుండా దాచుకునే వ్యక్తిని కాదు. ఎవర్ని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని నేను బహిరంగంగా ప్రకటించకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం వరుడి గురించి నన్ను ఎప్పుడైనా అడగొచ్చు. వాళ్లకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’ అని అనుష్క అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని