నేను అలాంటి నటిని కాదు!

ప్రతి పాత్రని లాక్కుని నటించే రకాన్ని కాదని నటి మన్నారా చోప్రా అన్నారు. ఆమె సునీల్‌ ‘జక్కన్న’, సాయిధరమ్‌ తేజ్ ‘తిక్క’, పూరీ జగన్నాథ్‌ ‘రోగ్‌’, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘సీత’ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. దిల్లీకి చెందిన ....

Published : 14 Mar 2020 22:28 IST

ముంబయి: ప్రతి పాత్రని లాక్కుని నటించే రకాన్ని కాదని నటి మన్నారా చోప్రా అన్నారు. ఆమె సునీల్‌ ‘జక్కన్న’, సాయిధరమ్‌ తేజ్ ‘తిక్క’, పూరీ జగన్నాథ్‌ ‘రోగ్‌’, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘సీత’ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. దిల్లీకి చెందిన ఈ భామ ముంబయి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి ఇంటికి ప్రయాణాలు చేసేవారట. కాగా ఇకపై ముంబయిలోనే ఉంటానని తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు. కెరీర్‌, పాత్రల ఎంపిక గురించి ప్రస్తావించారు.

‘నేను కొన్ని పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేశా. హిందీ, తెలుగు, తమిళం.. అని ఎంచుకుని ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. కథ నాకు నచ్చి, పాత్ర సౌకర్యవంతంగా అనిపిస్తే నటించా. ఇప్పుడు నేను ముంబయిలో ఉన్నా. ఇక్కడ అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద సినిమాలో సంతకం చేస్తానని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

వెబ్‌ సిరీస్‌లలో నటించడం గురించి మాట్లాడుతూ.. ‘జనవరిలో ఓ ప్రముఖ దర్శకుడు తీస్తున్న వెబ్‌ సిరీస్‌లో నటించాల్సి ఉంది. కానీ నాకు సౌకర్యంగా ఉంటేనే చేయాలి అనుకున్నా. బోల్డ్‌గా, స్కిన్‌ షో చేయడం నాకిష్టం లేదు. అలాంటి పాత్రలపై ఆసక్తి కూడా లేదు. ఇప్పుడు ఎలాంటి కంటెంట్‌ వస్తోందో మనమంతా చూస్తున్నాం. నా వద్దకు వచ్చిన ప్రతి పాత్రను లాక్కుని నటించే రకం నేను కాదు. ఒక్క సినిమా తర్వాత మరొక్కటి చేస్తుంటా’ అని మన్నారా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని