అయాన్‌ పట్ల గర్వంగా ఉంది: అల్లు అర్జున్‌

తన కుమారుడు అల్లు అయాన్‌ పట్ల గర్వపడుతున్నానని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన తన కుమారుడి విద్యాబ్యాసాన్ని ఉద్దేశిస్తూ ఆదివారం ట్వీట్లు చేశారు. అయాన్‌ పాఠశాల వేడుకల్లో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘ప్రీ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు. అయాన్‌ నువ్వు ఎదిగినందుకు.....

Published : 15 Mar 2020 16:08 IST

హైదరాబాద్‌: తన కుమారుడు అల్లు అయాన్‌ పట్ల గర్వపడుతున్నానని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన తన కుమారుడి విద్యాబ్యాసాన్ని ఉద్దేశిస్తూ ఆదివారం ట్వీట్లు చేశారు. అయాన్‌ పాఠశాల వేడుకల్లో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘ప్రీ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు. అయాన్‌ నువ్వు ఎదిగినందుకు చాలా గర్వంగా ఉంది. జీవితం విలువల్ని నా కుమారుడికి నేర్పినందుకు బోధివాలీ స్కూల్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాఠశాలలో నా కుమారుడ్ని చేర్పించినందుకు తల్లిదండ్రులుగా మేం చాలా సంతోషిస్తున్నాం. అతడికి మంచిచెడు నేర్పిన ఉపాధ్యాయులకు, ఇన్నేళ్లు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్న సిబ్బందికి నా థాంక్స్‌. ఇది గర్వించదగ్గ మధురమైన రోజు’ అని ఆయన ట్వీట్లు చేశారు.

‘అల వైకుంఠపురములో..’ తర్వాత బన్నీ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. శేషాచలం అడవులు, ఎర్రచందనం దొంగల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు సమాచారం. రష్మిక కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ఇదే కావడంతో అంచనాలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని