ఈ ఏడాది గొల్లపూడి జాతీయ అవార్డు వీరికే!

గొల్లపూడి మారుతీరావు కుమారుడు, దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్‌ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ‘గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డు’ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గానూ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు విభాగంలో ఇద్దరికి సంయుక్తంగా అవార్డును అందిస్తున్నట్లు సోమవారం ఫౌండేషన్‌ సభ్యులు ప్రకటన....

Published : 16 Mar 2020 20:31 IST

హైదరాబాద్‌: గొల్లపూడి మారుతీరావు కుమారుడు, దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్‌ జ్ఞాపకార్థం ఏటా ‘గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డు’ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గానూ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు విభాగంలో ఇద్దరికి సంయుక్తంగా అవార్డును అందిస్తున్నట్లు సోమవారం ఫౌండేషన్‌ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. హిందీలో చిత్రీకరించిన మిలటరీ యాక్షన్‌ చిత్రం ‘ఉరి’కిగానూ దర్శకుడు ఆదిత్యనాథ్‌ను, మలయాళంలో తెరకెక్కించిన డ్రామా చిత్రం ‘కుంబలంగి నైట్స్‌’కుగానూ మధు సి నారాయణన్‌ను ఉత్తమ దర్శకులుగా గుర్తించినట్లు తెలిపారు. అవార్డు ఎంపికకు వివిధ భాషల నుంచి 22 నామినేషన్లు రాగా.. వీరికి సంయుక్తంగా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రతి ఏడాది మార్చి 17న శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా అవార్డును ప్రకటిస్తున్నారు. ఆగస్టు 12న ఆయన వర్ధంతి సందర్భంగా అవార్డును ప్రదానం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని