సినిమాలు ఉచితంగా చూడాలా... ఓ లుక్కేయండి

సినిమాలు చూడాలంటే థియేటర్లు లేదా టీవీలు. అయితే కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇలాంటప్పుడు బయటకెళ్లి హాల్‌లో సినిమాలు చూసే అవకాశం ఉండదు. పాత, కొత్త సినిమాలు...

Updated : 31 Mar 2020 08:24 IST

సినిమాలు చూడాలంటే థియేటర్లు లేదా టీవీలు. అయితే కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇలాంటప్పుడు బయటకెళ్లి హాల్‌లో సినిమాలు చూసే అవకాశం ఉండదు. పాత, కొత్త సినిమాలు టీవీల్లో చూడాలంటే మాత్రం ఆయా ఛానెళ్ల సమయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ చేతికొచ్చాక సినిమాలు, సీరియళ్లు, విభిన్న కార్యక్రమాలు అన్నీ ఐదారు అంగుళాల తెరలోనే చూసేస్తున్నారు. అదీ ఉచితంగా! ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక ఎంచక్కా డౌన్‌లోడ్‌ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేస్తున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌  స్టోర్‌ను యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఆయా సినిమాలు చూసుకోవచ్చు. అలా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉన్న పలు యాప్స్‌ వివరాలను తెలుసుకుందామా? 

ఈటీవీ విన్‌ (ETV win)

ఈటీవీకి చెందిన ఏడు ఛానళ్లలోని కార్యక్రమాలు, ఆసక్తికరమైన సినిమాలను, మనోరంజమైన సీరియళ్లను ఒకే వేదిక మీద అందిస్తోంది ‘ఈటీవీ విన్‌’ (ETV win). చూడముచ్చటైన లే అవుట్‌, చక్కటి వర్గీకరణతో ఈటీవీ విన్‌ రియాలిటీ షోలు, సీరియళ్లు, వినోద కార్యక్రమాలను అందిస్తోంది. వంటల రెసిపీలు, ఈటీవీలో ప్రసారమైన ప్రముఖ ఈవెంట్లు ఇందులో ఉంటాయి. వాటిలో ఈటీవీ విన్‌ ఎక్స్‌క్లూజివ్‌ పేరుతో టెలీ సీరియళ్లు, వెబ్‌సిరీస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటన్నింటితోపాటు అలనాటి మేటి ఈటీవీ సీరియళ్లు ఇందులో పొందుపరిచారు. వాటిని ఆఫ్‌లైన్‌ చేసుకొని చూడొచ్చు. 

ఈటీవీ విన్‌ ఫీచర్స్‌

* వాచ్‌ లేటర్‌ సదుపాయం

* సెర్చ్‌ చేసి పాత సీరియల్స్‌ చూడగలగడం

* ప్రిఫరెన్స్‌ ఏర్పాటు

* ఆఫ్‌లైన్‌ సదుపాయం

* యాడ్స్‌ తక్కువ

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

విడ్‌మేట్‌ (VidMate)

విడ్‌మేట్‌ (VidMate) యాప్‌ ద్వారా విడుదలైన కొద్ది రోజులకే కొత్త సినిమాలను చూసే అవకాశం ఉంది. అదే విధంగా సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకుని దాచుకునే వీలుంది. యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) సౌకర్యంతో వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. యాప్‌తో బాలీవుడ్‌, టాలీవుడ్, హాలీవుడ్‌, డబ్బింగ్‌ సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాయిగా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమైన డౌన్‌లోడింగ్‌ యాప్స్‌లో ఇదొకటి. అయితే ఈ యాప్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో లేదు. నేరుగా వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

విడ్‌మేట్‌ ఫీచర్స్‌

* మల్టిపుల్‌ డౌన్‌లోడ్స్‌

* సంవత్సరం, రేటింగ్‌, కేటగిరీ ఎంచుకునే అవకాశం

* యూజర్‌ ఫ్రెండ్లీ

* కొత్త సినిమాలు

* యాడ్స్‌ తక్కువ

* భారతీయ సినిమాలు, టీవీ షోలు, సీరియళ్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

యూట్యూబ్‌ (Youtube)

యూట్యూబ్‌.. ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరికీ తెలిసిన పదం. తమకు కావాల్సిన కామెడీ, హారర్‌, సందేశాత్మక వీడియోలను చూసేందుకు ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్‌. ఏదైనా సినిమా టీజర్‌, ట్రైలర్ విడుదలైందంటే యూట్యూబ్‌ ఓపెన్‌ చేసేస్తాం. ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఫ్లాట్‌ఫాంలలో యూట్యూబ్‌ ఒకటి. వినూత్నంగా రూపొందించిన వీడియోలను అప్‌లోడ్‌ చేయాలన్నా, డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నా వేదిక యూట్యూబ్‌. ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఒక్కో ప్రొడక్షన్‌ హౌస్‌ ఒక్కో యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాయి. యూట్యూబ్‌ ద్వారా ఎంతో మందికి ఆదాయం కూడా వస్తోంది. అయితే ఎలాంటి యాడ్స్‌ లేకుండా, బ్యాక్‌ గ్రౌండ్‌లో వీడియోస్‌ ప్లే అవడం, వంటి ఆప్షన్స్‌తో ‘యూట్యూబ్‌ ప్రీమియం’ తీసుకొచ్చింది. దీనికి యూట్యూబ్‌ కొంత డబ్బు వసూలు చేస్తుంది. 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

లైవ్‌నెట్‌ టీవీ  (LiveNetTV)

లైవ్‌నెట్‌ టీవీ యాప్‌ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌. ఎనిమిది దేశాల్లో సుమారుగా 700కిపైగా లైవ్‌ ఛానెల్స్‌, సినిమాలు, వీవోడీ, టీవీ షోలు, లైవ్‌ స్పోర్ట్స్‌, ప్రఖ్యాత కార్యక్రమాలను యాప్‌ ద్వారా వీక్షించవచ్చు. ఇవన్నీ ఉచితం కావడం విశేషం. యాప్‌లో భారీ సంఖ్యలో బాలీవుడ్, హాలీవుడ్‌, డబ్బింగ్‌, పంజాబీ, యానిమేటెడ్‌ సినిమాలు.. అందుబాటులో ఉన్నాయి. 

లైవ్‌నెట్‌ టీవీ యాప్‌ ఫీచర్స్‌

* హై క్వాలిటీ లైవ్‌ టీవీ స్ట్రీమింగ్‌

* సినిమాల కోసం వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ)

* క్రోమ్‌కాస్ట్‌ సపోర్ట్‌

* వివిధ విభాగాల్లో 750కిపైగా లైవ్‌ ఛానెల్స్‌

* వీడియో ప్లేయర్‌ సపోర్ట్‌

* అన్ని వీడియోలు పూర్తిగా ఉచితం

* యూజర్‌ ఫ్రెండ్లీ

* సౌకర్యార్థం ఛానెల్స్‌ను ఫిల్టర్‌ చేసుకునే అవకాశం

 

జియోసినిమా (JioCinema)

సినిమాలు, టీవీ షోలు వీక్షించేందుకు, డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వినియోగించే యాప్స్‌లో జియో సినిమా (JioCinema) ఒకటి. 15 భారతీయ భాషల్లో 10 విభిన్న అంశాలను చూసేందుకు అవకాశం ఉంది. యాప్‌లో కొత్త సినిమాలు, షోలకు సంబంధించిన కంటెంట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉంటారు. భారతీయ సినిమాలను ఉచితంగా చూసేందుకు జియో సినిమా యాప్‌ మంచి వేదిక. అయితే దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మాత్రం జియో సిమ్‌ ఉండాల్సిందే మరి. జియో సిమ్‌ లేకపోయినా సినిమాలను చూడొచ్చు. అదెలాగంటే గూగుల్‌ క్రోమ్‌లో జియో ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి సినిమాలను ఆస్వాదించవచ్చు. 

జియోసినిమా ఫీచర్స్‌

* సినిమాలు, సంగీత వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూడొచ్చు

* క్రోమ్‌కాస్ట్‌ సపోర్ట్‌

* యాడ్‌ ఫ్రీ

* 15 భాషల్లోని సినిమాలు, వెబ్‌ సిరీస్‌, టీవీ షోలు చూసే అవకాశం

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

హాట్‌స్టార్‌ (HotStar)

హాట్‌స్టార్‌ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌. ప్రస్తుతం ట్రెండింగ్‌లో, పాపులర్‌ అయిన బాలీవుడ్‌, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ, తెలుగు సినిమాలను హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఆన్‌లైన్‌లో క్రికెట్‌, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్స్‌లో హాట్‌స్టార్‌ ఒకటి. ఈ యాప్‌ బాగా పాపులర్‌ అవ్వడానికి ప్రధాన కారణం యాడ్స్‌ సపోర్ట్‌తో ప్రీమియర్‌ యూజర్లకు పెద్ద సంఖ్యలో సినిమాలను అందుబాటులో ఉంచడమే. ఇప్పుడిది డిస్నీతో జోడీ కట్టి డిస్నీ+హాట్‌స్టార్‌గా మారింది. మరింత మజాను తీసుకొచ్చింది. 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

వూట్‌ (Voot)

వయోకామ్‌18 మీడియా సంస్థకు చెందిన డిజిటల్‌ ప్లాట్‌ఫాం వూట్‌. వూట్‌ యాప్‌ను ఏడు కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా.. నెలకు మూడు కోట్లమంది వూట్‌ సైట్‌ను సందర్శిస్తుంటారు. వూట్‌ అడ్వర్టైజింగ్‌ వీవోడీ పద్ధతిన తన సేవలను అందిస్తోంది. వూట్‌కు తన సొంత నెట్‌వర్క్‌ ఛానెల్స్‌ అయిన కలర్స్‌ టీవీ, ఎంటీవీ, నిక్‌ ఇండియా, సినీప్లెక్స్‌, ఇతర టీవీ ఛానెల్స్‌ నుంచి కంటెంట్‌ను వీక్షకులకు అందుబాటులో ఉంచుతోంది. వివిధ భారతీయ భాషల చిత్రాలను స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. ఈ యాప్‌ ముఖ్యంగా భారత్‌లో అందుబాటులో ఉంది. మీరు విదేశాల్లో సేవలు పొందాలంటే మాత్రం వీపీఎన్‌ (vpn) అనుమతి పొందాల్సిందే. 

వూట్‌ ఫీచర్స్‌

* వయోకామ్‌ మీడియా సినిమాలు, టీవీ షోలు

* సింపుల్‌ యాక్సస్‌

* కేవలం భారత్‌లోనే అందుబాటులో..

* వీడియో ఆటో క్వాలిటీ

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

జీ5 (Zee5)

జీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఛానెల్స్‌ మనందరికి తెలిసిందే. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో దేశంలోనే జీ అతిపెద్ద సంస్థ. జీ5 ప్రీమియం మోడల్‌పై ఉచితంగా సినిమాలు చూసేందుకు అవకాశం కల్పించింది. అయితే కొత్త సినిమాలను చూడాలనుకుంటే కొంత ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖుల సినిమాలన్నీ ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. రీజనల్‌ భాషలకు చెందిన సినిమాలు భారీ సంఖ్యలో వీక్షించవచ్చు. 

జీ5 యాప్‌ ఫీచర్స్‌

* స్ట్రీమింగ్‌ క్వాలిటీ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు
* ఎలాంటి సినిమాలను చూడాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు
* ఎలాంటి ఖాతాను ఓపెన్‌ చేయకుండానే ఎక్కువ సినిమాలను వీక్షించవచ్చు

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

సోనీలైవ్‌ (SonyLiv)

సోనీలైవ్‌ అచ్చమైన భారతీయ సినిమాలకు ఫ్లాట్‌ఫ్లాం. ఇది కూడా జీ5 లా ప్రీమియమ్‌ మోడల్‌లో సినిమాలను ఆస్వాదించవచ్చు. యాడ్స్‌తో కూడిన సినిమాలు, టీవీ షోలు, ఇతర కార్యక్రమాలను చూసే అవకాశ ఉంది. ఇదే కాకుండా ప్రీమియంతో  క్రీడా కార్యక్రమాలను సోనీలైవ్‌ అందుబాటులో ఉంచింది. ఎన్‌బీఏ, ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌, సెరీఏ, ఈపీఎల్‌ వంటి లైవ్‌లను చూడొచ్చు. అయితే లైవ్‌ మ్యాచ్‌లు సుమారుగా ఐదు నిమిషాలపాటు కాస్త లేటుగా సోనీలైవ్‌లో ప్లే అవుతాయి. 
సోనీలైవ్‌ ఫీచర్స్‌

* సోనిలైవ్‌ యాప్‌ను కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే

* ఫ్రీ స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్ట్‌

* తక్కువ నెట్‌వర్క్‌ ఉన్నా పని చేస్తుంది

* సులభంగా ఆపరేట్‌ చేసే వెసులుబాటు

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

ఎయిర్‌టెల్‌ టీవీ (Airtel TV)

ఎయిర్‌టెల్‌ టీవీ లైవ్‌ టీవీ కమ్‌ టీవీ షో యాప్‌. ఈ యాప్‌ కేవలం ఎయిర్‌టెల్‌ సిమ్‌ యూజర్స్‌ మాత్రమే ఉపయోగించగలరు. అయితే ఒక్క లాగిన్‌ మీద ఐదింట్లో యాప్‌ను వాడుకునే అవకాశం ఎయిర్‌టెల్‌ కల్పించింది. యాప్‌లో బాలీవుడ్‌, హాలీవుడ్‌, టాలీవుడ్‌, ఇతర భారతీయ భాషల చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. సోనీ నెట్‌వర్క్‌, జీ‌, నెట్‌వర్క్‌ 18, ఎఫ్‌టీఏ ఛానెల్స్ నుంచి ఫీడ్‌ను తీసుకుని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. 

ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ ఫీచర్స్‌

* భారత్‌లోని ప్రాంతీయ నెట్‌వర్క్స్‌ నుంచి లైవ్‌ టీవీ, సినిమాలు చూడొచ్చు

* వ్యక్తిగత వాచ్‌లిస్ట్‌ను ఏర్పాటు చేసుకొని వీడియోలను ఆస్వాదించొచ్చు

* సింగిల్‌ లాగిన్‌పై మల్టీ డివైస్‌ యాక్సెస్‌

* అందుబాటులో కామెడీ, డ్రామా, యాక్షన్‌, థ్రిల్లర్‌, పిల్లలు, సైన్స్‌, ట్రెండింగ్‌ వీడియోలు

* పాజ్‌, రెజ్యూమ్‌ ఆప్షన్స్‌

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

థోప్‌టీవీ (ThopeTV)

థోప్‌టీవీ యాప్‌ వల్ల మీకిష్టమైన ఒక్క టీవీ కార్యక్రమాన్ని కూడా మిస్ చేసుకోలేరు. థోప్‌టీవీ వేలాది ఛానెల్స్‌ను ఉచితంగానూ, ప్రీమియమ్‌ పద్ధతిలోనూ ప్రేక్షకులకు అందిస్తోంది. కొన్ని వీడియోలను ఉచితంగా ఎలాంటి ఖాతా, సబ్‌స్క్రిప్షన్‌ అవసరం లేకుండా ఆస్వాదించవచ్చు. భారత్, యూకే, యూఎస్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, ది మిడిల్‌ ఈస్ట్‌, ఇతర యూరోపియన్‌ దేశాల లైవ్‌ టీవీ ఛానెల్స్‌ అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ను చూడొచ్చు. అయితే కాపీరైట్స్‌ సమస్యతో కొన్ని ఛానెల్స్‌ మనదేశంలో పనిచేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు వీపీఎన్‌ పర్మిషన్‌ తీసుకుంటే సరిపోతుంది. 

థోప్‌టీవీ ఫీచర్స్‌

* ఉచితంగా లైవ్‌ టీవీ యాప్స్‌ 

* ఉత్తమమైన స్ట్రీమింగ్‌ క్వాలిటీ

* పెద్ద సంఖ్యలో భారతీయ ఛానెల్స్‌

* అందుబాటులో ప్రాంతీయ, జాతీయ నెట్‌వర్క్స్‌ 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని