Published : 17 Mar 2020 21:34 IST

కరోనా ఎఫెక్ట్‌: యదార్థ ఘటన షేర్‌ చేసిన కాజల్‌

‘నా గుండె పగిలింది’

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక కాజల్‌ తన హృదయాన్ని కదిలించిన ఓ నిజ జీవిత సంఘటనను ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకున్నారు. కరోనా వైరస్‌ను అరికట్టే నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైరస్‌ వల్ల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కష్టపడుతున్నాడని, ఇది తెలిసిన తర్వాత తన గుండె పగిలిందని అన్నారు.

‘ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నా ముందు నిల్చుని ఏడ్చాడు. గత 48 గంటల్లో నేనే తన మొదటి కస్టమర్‌ అని చెప్పాడు. కనీసం ఇవాళ అయినా నేను సరకులు తీసుకెళ్తానని నా భార్య అనుకుంటోందని అన్నాడు. ఈ వైరస్‌ మనల్ని అనేక విధాలుగా దెబ్బతీస్తోంది. కానీ రోజువారి ఆదాయం మీద జీవితం గడిపేవాళ్లు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతడికి రూ.500 ఎక్కువగా ఇచ్చా. మనలోని చాలా మందికి ఇలా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అంతేకాదు తన గత కస్టమర్‌ను వదిలిపెట్టిన తర్వాత దాదాపు 70 కిలోమీటర్లు డ్రైవింగ్‌ చేశానని అతడు చూపించాడు. దయచేసి మీ క్యాబ్ డ్రైవర్లకు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉన్న వారికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే.. ఆరోజుకి మీరే వాళ్ల చివరి కస్టమర్‌ కావొచ్చు’ అని రాసి ఉన్న పోస్ట్‌ను కాజల్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని