జనతా కర్ఫ్యూ: నెట్టింట్లో ‘బాబా’ పాట వైరల్‌

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బాబాసెహగల్‌ తాజాగా జనతా కర్ఫ్యూపై ఓ ప్రత్యేకమైన పాటను అలపించారు. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐటీ కంపెనీలతోపాటు పలు ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌....

Published : 22 Mar 2020 14:24 IST

షేర్‌ చేసిన గాయకుడు

ముంబయి: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బాబాసెహగల్‌ తాజాగా జనతా కర్ఫ్యూపై ఓ ప్రత్యేకమైన పాటను అలపించారు. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐటీ కంపెనీలతోపాటు పలు ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబా సెహగల్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చినప్పుడు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. మంచి ఆహారం తీసుకుని.. సరదాగా ఇంట్లో ఉండండి అని చెబుతూనే.. ‘కరోనా.. గో.. గో.. గోనా’ అని పేర్కొంటూ ఓ ప్రత్యేకమైన పాటను అలపించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దేశంలో కరోనా రోజురోజూకీ విపరీతంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలకు ‘కొవిడ్‌-19’పై అవగాహన కల్పించే విధంగా ఇటీవల బాబా సెహగల్‌ ‘నమస్తే’ అంటూ సాగే ఓ పాటను అలపించిన విషయం తెలిసిందే. ‘కరోనా చాలా సున్నితమైన అంశం కాబట్టి దానిపై ఎలాంటి పాటను చేయకూడదనుకున్నాను. కాకపోతే ప్రిన్స్‌ ఛార్లెస్‌ నమస్తే పెట్టడం చూశాక.. ‘నమస్తే’ పాటను రూపొందించాను’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు