జనతా కర్ఫ్యూపై పాట.. షేర్‌ చేసిన మోదీ

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ విధించిన జనతా కర్ఫ్యూపై బాలీవుడ్‌ గాయని మాలినీ అవస్థీ పాట పాడారు. దీన్ని మోదీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా కృషి చేస్తున్నారు. గాయని మాలినీ అగస్థీ.....

Published : 22 Mar 2020 16:29 IST

ముంబయి: కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ విధించిన జనతా కర్ఫ్యూపై బాలీవుడ్‌ గాయని మాలినీ అవస్థీ పాట పాడారు. దీన్ని మోదీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా కృషి చేస్తున్నారు. గాయని మాలినీ అవస్థీ తనదైన శైలిలో ప్రజల్లో అవగాహన కల్పించి, స్ఫూర్తి నింపుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

‘‘కరోనా ప్రభావం ఇంట్లో, ఆఫీసులో.. ప్రతి ఒక్కరి కంటికి కనపడుతోంది. ఇప్పుడు అదే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారి.. అందర్నీ భయపెడుతోంది. ఈ వ్యాధి ఎక్కడ వస్తుందో అని ప్రతి ఒక్కరూ కంగారుపడుతున్నారు. మనంతా కలిసికట్టుగా చిరునవ్వుతో దీన్ని ఎదుర్కోవాలి..’’ అంటూ సాగిన ఈ గీతం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఇదే పాటలో చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలనే దానిపై కూడా సూచనలు ఇచ్చారు. మాలినీ జానపద గాయనిగా గుర్తింపు పొందారు. ఆమె భోజ్‌పూరి, అవధి, బందేల్‌ఖండి భాషల్లో పాటలు పాడారు. హిందీలోనూ పలు గీతాలు ఆలపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని