Updated : 22 Mar 2020 18:24 IST

వైద్యులకు జేజేలు పలికిన చెర్రీ, తారక్‌, బన్నీ...

హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా సేవలందిస్తున్న వైద్యులకు సినీ ప్రముఖులు జేజేలు పలికారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆరు బయటికి వచ్చిన వీరు చప్పట్లు కొట్టారు. వైద్యుల సేవను మెచ్చుకున్నారు. పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, పూరీ జగన్నాథ్‌, ఛార్మి, అనిల్‌ రావిపూడి, తమన్నా, పూజా హెగ్డే, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ తదితరులు చప్పట్లు కొట్టారు. వీరంతా తమ తమ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. కరోనాతో పోరాడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, పోలీసులకు సెల్యూట్‌ అంటూ వీరు పోస్ట్‌లు చేశారు.





















Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని