నటుడు రాజశేఖర్‌ దాతృత్వం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయం మూలంగా షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆ రోజు పని చేస్తే కానీ ఇల్లు గడవని నిరుపేద కళాకారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా....

Published : 22 Mar 2020 20:52 IST

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయం కారణంగా షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆ రోజు పని చేస్తే కానీ ఇల్లు గడవని నిరుపేద కళాకారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయబోతున్నట్లు సీనియర్ నటుడు రాజశేఖర్‌ దంపతులు తెలిపారు.

రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ బాధ్యతగా సరకులు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు 90108 10140 నెంబర్‌కు సంప్రదించాలని, పూర్తి వివరాలు అందించి సహాయం పొందాలని కోరారు. కరోనా కారణంగా షూటింగ్‌లే కాకుండా సినిమా విడుదల తేదీలు కూడా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని