ఇది నా జీవితంలో సాహసోపేతమైంది: రజనీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి 8 గంటలకు ఇది ప్రసారం కాబోతోంది. ఈ షో కోసం రజనీ కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు.....

Updated : 17 Oct 2022 16:09 IST

థాంక్స్‌ ఫ్రెండ్‌

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి 8 గంటలకు ఇది ప్రసారం కాబోతోంది. ఈ షో కోసం రజనీ కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు. రజనీ తొలిసారి బుల్లితెరపై కనిపించబోతున్న షో ఇది కావడంతో అభిమానుల్లో ఆతృత నెలకొంది. కాగా ఈ షోను ఉద్దేశించి రజనీ ట్వీట్‌ చేశారు. ‘నా జీవితంలో అత్యంత సాహసోపేతమైన అనుభవాలలో  ఇదొకటి. నేను ఈ షో చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్‌ చేశానో.. మీరు చూస్తూ అంతే ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా. థాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌ బేర్‌ గ్రిల్స్‌’ అని పేర్కొన్నారు.

రజనీ పోస్ట్‌ను ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ రీట్వీట్‌ చేశారు. ‘ఈ షోను మిస్‌ కావొద్దు. నా తండ్రి పట్ల చాలా చాలా గర్వంగా ఉంది. ఇది అంత సులభమైన పనికాదు. షూట్‌ను దగ్గరుండి చూసే అదృష్టం నాకు దక్కింది. ఈ అద్భుతమైన మధురజ్ఞాపకాన్ని నాకు ఉంచినందుకు బేర్‌ గ్రిల్స్‌కు వెయ్యిసార్లు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ఆమె చెప్పారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని