రజనీ స్టైల్ కాపీ కొట్టేందుకు బేర్ గ్రిల్స్ తిప్పలు..!
సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్‌ను కాపీ కొట్టాలని సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తిప్పలుపడ్డారు. వీరిద్దరు కలిసి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రజనీ స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకోవడం చూసిన బేర్ గ్రిల్స్ తను కూడా అలా పెట్టుకోవడానికి ప్రయత్నించారు.....
ఫన్నీ వీడియో వైరల్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్‌ను కాపీ కొట్టాలని సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తిప్పలుపడ్డారు. వీరిద్దరు కలిసి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రజనీ స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకోవడం చూసిన బేర్ గ్రిల్స్ తను కూడా అలా పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన వల్ల కాకపోవడంతో రజనీ సాయం తీసుకున్నారు. రజనీ ఇలా చేయాలని చెప్పినా.. ఫలితం లేకపోయింది. చివరికి ఆయనే స్వయంగా కళ్లజోడు పట్టుకుని తన స్టైల్‌ను నేర్పించారు. ‘అందుకే నువ్వు సినిమా స్టార్..’ అని వీడియోలో బేర్ గ్రిల్స్ రజనీని మెచ్చుకున్నారు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది.
డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో రజనీ కనిపించారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన షో ప్రసారమైంది. ఈ షో కోసం రజనీ కర్ణాటకలోని బందిపొరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు. రజనీ తొలిసారి బుల్లితెరపై కనిపించిన షో కావడంతో అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా భాగస్వామ్యం అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
Guntur: తెదేపా ‘మోత మోగిద్దాం’లో పాల్గొన్న వారిపై కేసు
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్