లాక్‌డౌన్‌ను పొడిగించాలి: పూరీ జగన్నాథ్‌

ఇంట్లో కూర్చొని దేశాన్ని కాపాడే అదృష్టం ప్రజలకు వచ్చిందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ అమలుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం విధించిన వారం రోజుల లాక్ డౌన్ సరిపోదు. మరో వారం ....

Published : 24 Mar 2020 15:15 IST

హైదరాబాద్‌: ఇంట్లో కూర్చొని దేశాన్ని కాపాడే అదృష్టం ప్రజలకు వచ్చిందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ అమలుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం విధించిన వారం రోజుల లాక్ డౌన్ సరిపోదు. మరో వారం పొడిగించాలి. కరోనా వైరస్ పట్ల అలసత్వం ప్రదర్శిస్తే గతంలో అంటువ్యాధుల పట్ల సంభవించిన మరణాల కంటే మరింత ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు, వైద్యుల మాటలు తప్ప మరెవరి మాటలు వినొద్దు. దాదాపు వైరస్‌లు నగరంలోనే పుడతాయి. అడవుల్లో వైరస్‌ పుట్టదు.. ఎందుకంటే అక్కడి జంతువులు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించవు. లాక్‌డౌన్‌ అని చెబుతుంటే.. ప్రజలకు అర్థం కావడం లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి.. రోడ్లపైన తిరుగుతున్నారు. ఇవన్నీ మనకోసమే.. మనం పాటించకపోతే ఎలా? దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. ఇంట్లో కూర్చోండి.. దేశానికి సేవ చేయండి’ అని పూరీ చెప్పారు.

ఇదే సందర్భంగా నటుడు సుశాంత్‌ కూడా ప్రజలకు సూచనలు ఇచ్చారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఏవరైనా విదేశాల నుంచి వచ్చినా, లేదా కరోనా లక్షణాలు తమలో కనిపించినా వెంటనే 104 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని