Updated : 25 Mar 2020 17:33 IST

చిరు ఫస్ట్‌ ట్వీట్‌ అదే..!

ట్విటర్‌లోకి అడుగుపెట్టిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి బుధవారం నుంచి ట్విటర్‌లోకి వచ్చారు. శ్రీ శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన ఫస్ట్‌ ట్వీట్‌ చేశారు. ‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం.’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. మెగాస్టార్‌ ట్విటర్‌లోకి అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆయన్ని దాదాపు 12 వేల మంది ఫాలో అవుతున్నారు. 

గతేడాది విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి దేవదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారని సమాచారం. కరోనా కల్లోలం కారణంగా ప్రస్తుతానికి ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని