రానా-త్రిష-బన్నీ వీడియో కాలింగ్‌

స్నేహితులు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ తనకు కంపెనీ ఇచ్చారని కథానాయిక త్రిష చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో సినీ ప్రముఖులు సైతం ఇంటికే

Published : 29 Mar 2020 19:05 IST

స్వీయ నిర్బంధంలో..

చెన్నై: స్నేహితులు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ తనకు కంపెనీ ఇచ్చారని కథానాయిక త్రిష చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో సినీ ప్రముఖులు సైతం ఇంటికే పరిమితమయ్యారు. కాగా తనకు రానా, బన్నీ కంపెనీ ఇచ్చారని త్రిష ఓ పోస్ట్‌ చేశారు. వీడియో కాల్‌లో ముచ్చట్లు చెప్పుకున్నామని తెలుపుతూ స్క్రీన్‌ షాట్‌ను ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తోనూ త్రిష వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు.

త్రిష చాలా ఏళ్ల తర్వాత ఇటీవల తెలుగు సినిమా ‘ఆచార్య’కు సంతకం చేశారు. కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కానీ పలు కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. 2015లో వచ్చిన ‘లయన్‌’ ఆమె తెలుగులో నేరుగా నటించిన చివరి సినిమా. ఆ తర్వాత ఇన్నేళ్లకు ‘ఆచార్య’తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అభిమానులు ఆనందపడ్డారు. కానీ అది నిజం కాలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు తమిళ చిత్రాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని