హీరోయిన్ల తీరుపై బ్రహ్మాజీ అసంతృప్తి!

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ చిత్ర పరిశ్రమలోని హీరోయిన్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. కరోనా క్రైసిస్‌ ఛారిటీకి విరాళాలు అందించడానికి నటీమణులు ముందుకు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులులేక బాధపడుతున్న సినీ కార్మికుల ఆకలి తీర్చేందుకు అగ్ర....

Published : 31 Mar 2020 17:28 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ చిత్ర పరిశ్రమలోని హీరోయిన్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. కరోనా క్రైసిస్‌ ఛారిటీకి విరాళాలు అందించడానికి నటీమణులు ముందుకు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులులేక బాధపడుతున్న సినీ కార్మికుల ఆకలి తీర్చేందుకు అగ్ర కథానాయకుడు చిరంజీవి చొరవతో టాలీవుడ్‌ ప్రముఖులంతా కలిసి కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటికే అనేక మంది సినీ తారలు విరాళాలు ఇచ్చారు.

చిరు రూ.కోటి, నాగార్జున రూ.కోటి, ప్రభాస్‌ రూ.50 లక్షలు, నాని రూ.30 లక్షలు, తారక్‌ రూ.25 లక్షలు, వరుణ్‌తేజ్‌ రూ.20 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, లావణ్య త్రిపాఠి రూ.లక్ష... ఇలా తమ వంతు సహాయం చేశారు. బ్రహ్మాజీ రూ.75 వేలు విరాళంగా ఇచ్చారు.

అయితే రూ.కోట్లు పారితోషికం తీసుకుంటున్న కథానాయికలు మాత్రం సినీ కార్మికుల కష్టాలు తీర్చడానికి ముందుకు రావడం లేదని బ్రహ్మాజీ తాజాగా అన్నట్లు ఆంగ్ల పత్రికలు రాశాయి. భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటారని, కానీ ఇక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారట. ‘లావణ్య త్రిపాఠి తప్ప.. మిగిలిన నటీమణులు ఎందుకు విరాళం ఇవ్వలేదు?ఇక్కడ డబ్బు పెద్ద విషయం కాదు.. ఇది పరిశ్రమ పట్ల వారికున్న కృతజ్ఞతను తెలుపుతుంది’ అని అన్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని