కరోనా ఎఫెక్ట్‌.. జోర్దాన్‌లో చిక్కుకుపోయిన స్టార్‌ హీరో

కరోనా ఎఫెక్ట్‌ కారణంగా మలయాళి స్టార్‌హీరో పృథ్విరాజ్‌ జోర్దాన్‌లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న మలయాళి చిత్రం ‘ఆదుజీవితం‌’. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కొంతకాలం నుంచి జోర్దాన్‌లో జరుగుతుంది....

Published : 01 Apr 2020 16:02 IST

తిరువనంతపురం: కరోనా ఎఫెక్ట్‌ కారణంగా మలయాళీ స్టార్‌హీరో పృథ్విరాజ్‌ జోర్దాన్‌లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న మలయాళీ చిత్రం ‘ఆదుజీవితం‌’. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కొంతకాలం నుంచి జోర్దాన్‌లో జరుగుతుంది. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో షూటింగ్స్‌ను నిలిపివేయాలని అక్కడి అధికారులు కోరారు. దీంతో పృథ్విరాజ్‌, ఇతర చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే రాకపోకలపై అనుమతి లేకపోవడంతో వారు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ పృథ్విరాజ్‌ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

‘హాయ్‌ ఆల్. అందరూ జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా తదుపరి చిత్రం ‘ఆదుజీవితం’ షూటింగ్‌ జోర్దాన్‌లో జరుగుతుంది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో షూటింగ్‌ను నిలిపివేయాలని జోర్దాన్‌ అధికారులు మాకు 24-03-2020 తేదీన సూచించారు. అనంతరం వారు మా పరిస్థితులను అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ జరుపుకోవాలని తెలిపారు. కరోనా మహమ్మారి విషపుకోరలు చాస్తున్న తరుణంలో దానిని కట్టడి చేసేందుకు జోర్దాన్‌లోని అధికారులు కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించారు. దీంతో షూటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని మార్చి 27న సూచించారు. దీంతో మా చిత్రబృందాన్ని వాడిరామ్‌లోని క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోర్దాన్‌లో షూటింగ్‌ చేయడం కుదరదని చెప్పారు. అందుకే మేము ఇండియాకు రావాలని భావిస్తున్నాం. 58 మంది సభ్యులు ఉన్న మా బృందంలో ఓ వైద్యుడు ఉన్నారు. ఆయన 72 గంటలకొకసారి మాకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే జోర్దాన్‌ వైద్యాధికారులు కూడా మాకు నిరంతరం వైద్య పరీక్షలు చేస్తున్నారు. త్వరలోనే క్షేమంగా అక్కడికి వస్తామని ఆశిస్తున్నాను’ అని పృథ్వి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు