కరోనాపై పోరు.. బాలకృష్ణ ఏమన్నారంటే!

‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొడదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. స్టే హోం.. స్టే సేఫ్‌’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. కొవిడ్‌-19పై పోరాటంలో

Published : 03 Apr 2020 21:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొడదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. స్టే హోం.. స్టే సేఫ్‌’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. కొవిడ్‌-19పై పోరాటంలో తనవంతు సాయంగా రూ.1.25కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్వయంగా మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. 

‘‘ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ ఇంట్లో ఉందాం. కరోనాను కట్టడి చేద్దాం. కరోనా నియంత్రణకు అహర్నిశలూ శ్రమిస్తున్న, పోలీస్‌ యంత్రంగానికి, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, రెవెన్యూ శాఖ వారికి, ఇతర అధికారులకు, వైద్య సిబ్బందికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఎన్జీవో సంస్థలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’’ అని వీడియోలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం బాలకృష్ణ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారణాసిలో చిత్రీకరణ జరిపారు. కరోనా కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని