కరోనాపై కవిత: పాటగా పాడిన బాల సుబ్రహ్మణ్యం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు నిత్యం పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు ప్రముఖులు కరోనాపై

Updated : 04 Apr 2020 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు నిత్యం పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు ప్రముఖులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామోజీ ఫౌండేషన్‌ ‘కరోనాపై కదనం’ పేరుతో కవితల పోటీ నిర్వహిస్తోంది. నెల రోజుల పాటు రోజూ ఈ కవితల పోటీ ఉంటుంది. http://www.teluguvelugu.in/కు వెళ్లి కవితల పోటీకి సంబంధించి పూర్తి వివరాలు అక్కడ చూడవచ్చు. 

కాగా, ఏప్రిల్‌ 2 ఉదయం 9 నుంచి 3వ తేదీ ఉదయం 9గంటల వరకూ వచ్చిన కవితల్లో ‘మనిషిని నేను’ అనే కవిత ఉత్తమ కవితగా ప్రథమ బహుమతి అందుకుంది. శనివారం ఈనాడు ప్రధాన సంచికలో ప్రచురితమైన ఈ కవితను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహణ్యం పాటగా ఆలపించి ఆడియోను పంచుకున్నారు.

‘‘పొద్దున్నే అలవాటు ప్రకారం ‘ఈనాడు’ చదువుతున్నాను. రెండో పేజీలోకి రాగానే, ‘మనిషిని నేను’ అంటూ అమలాపురానికి చెందిన తంగెళ్ల రాజగోపాల్‌ రాసిన కవితకు ప్రథమ బహుమతి వచ్చింది. ఒకసారి చదివాను. ఎందుకో పాడుకోవాలనిపించింది. ఎవరైనా వింటారని కాదు.. వినాలని కాదు..నాకు అనిపించింది. అందుకే పాడుతున్నా. శ్రుతి, లయ ఏవీ లేవు. చేతిలో సెల్‌ఫోన్‌ మాత్రమే ఉంది. మధ్యలో మా కుక్క పిల్లలు కూడా అరవొచ్చు. కాకపోతే నా చుట్టుపక్కల ట్రాఫిక్‌, ఇతర శబ్దాలు లేవు. కనీసం నాకోసం నేను పాడుకుంటున్నా’’ అంటూ బాలసుబ్రహ్మణ్యం ఈ కవితను పాట పాడారు. మీరూ వినండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని