కరోనా లేని భారత్‌ని సాధిద్దాం: చెర్రీ

ప్రధాని పిలుపును పాటించి, కరోనా లేని భారత్‌ని సాధిద్దామని టాలీవుడ్‌ కథానాయకుడు రామ్‌చరణ్‌ అన్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా మార్చి 5 ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని లైట్లను నిలిపివేసి..

Published : 04 Apr 2020 21:06 IST

థ్యాంక్యూ రామ్‌చరణ్‌ గారు: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌: ప్రధాని పిలుపును పాటించి, కరోనా లేని భారత్‌ని సాధిద్దామని టాలీవుడ్‌ కథానాయకుడు రామ్‌చరణ్‌ అన్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా మార్చి 5 ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని లైట్లను నిలిపివేసి.. దీపాలు, క్యాండిల్స్‌ వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు రామ్‌చరణ్‌ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘అందరికీ నమస్కారం.. రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు మన ఇళ్లలో ఉన్న లైట్స్‌ అన్ని ఆపి వేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధాని మాట పాటిద్దాం. కరోనా లేని భారత్‌ని కచ్చితంగా సాధిద్దాం.’ అని రామ్‌చరణ్‌ పిలుపునిచ్చారు.

రామ్‌చరణ్‌ షేర్‌ చేసిన వీడియోపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును ముందుకు తీసుకువెళ్తున్న రామ్‌చరణ్‌ గారికి ధన్యవాదాలు’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని