వైద్యులు, పోలీసులకు గాయని సంఘీభావం

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఇబ్బందిపెడుతోన్న తరుణంలో దాని కట్టడి కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోలీసులు, వైద్యులు ఎన్నో కష్టపడుతున్నారు. తమ గురించి, తమ కుటుంబాల గురించి లెక్కచేయకుండా బయటకు వచ్చి ప్రజల సంక్షేమం కోసం...

Published : 05 Apr 2020 21:49 IST

ప్రత్యేకంగా పాట పాడిన నేహా

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఇబ్బందిపెడుతోన్న తరుణంలో దాని కట్టడి కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోలీసులు, వైద్యులు ఎన్నో కష్టపడుతున్నారు. తమ గురించి, తమ కుటుంబాల గురించి లెక్కచేయకుండా బయటకు వచ్చి ప్రజల సంక్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ముందుండి ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులను, పోలీసులకు సంఘీభావం తెలుపుతూ తెలుగు గాయని నేహా ఓ ప్రత్యేక పాటను అలపించారు. ‘దండాలు డాక్టరు బాబూ.. మా భూలోక దేవుడు నీవూ.. నీ ప్రాణము పణ్ణంగా పెట్టి ఈ లోకాన్నే కాపాడుతున్నావు’ అంటూ సాగే ఈ పాటను ఆమెను గ్రామీణ యాసలో పాడారు.

ప్రస్తుతం మన దేశంలో కూడా కరోనా రోజురోజూకీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3374 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 266 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకోగా 77 మంది మృతి చెందారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రప్రభుత్వాలు కూడా ఎంతగానో శ్రమిస్తున్నాయి.

 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని