కరోనాపై పోరు: కృష్ణంరాజు కుమార్తెల విరాళం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌పై పోరుకు ప్రముఖ నటుడు కృష్ణంరాజు కుమార్తెలు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి తమవంతు సాయం చేశారు. ముగ్గురు కలిసి తమ పాకెట్‌ మనీ నుంచి రూ.2 లక్షలు చెప్పునా పీఎం-కేర్స్‌కు రూ.6 లక్షలు విరాళం అందించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.....

Published : 06 Apr 2020 21:14 IST

హైదరాబాద్‌: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌పై పోరుకు ప్రముఖ నటుడు కృష్ణంరాజు కుమార్తెలు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి తమవంతు సాయం చేశారు. ముగ్గురూ కలిసి తమ పాకెట్‌ మనీ నుంచి రూ.2 లక్షలు చొప్పున పీఎం-కేర్స్‌కు రూ.6 లక్షలు విరాళం అందించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి సోమవారం తన జన్మదినం సందర్భంగా రూ.4లక్షలు విరాళం ఇచ్చారు. తల్లీకుమార్తెలు కలిసి ప్రధాన సహాయనిధికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రసంగానికి స్ఫూర్తి పొంది తమ వంతు సాయం చేసినట్లు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి చెప్పారు. మోదీని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రజలందరూ కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలని కోరారు. దేశమంతా ఒక్క తాటిపై నడుస్తుందన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగించిన మోదీకి కృతజ్ఞతగా విరాళం ఇచ్చినట్లు శ్యామలాదేవి అన్నారు.

ప్రభాస్‌ ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ.50 లక్షలు ప్రకటించారు. పీఎం-కేర్స్‌కు రూ.3 లక్షలు విరాళం అందించారు. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రూ.50 లక్షలు ఇచ్చి, మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రభాస్‌ ఇప్పటి వరకు కరోనాపై పోరుకు మొత్తం రూ.4.5 కోట్లు ప్రకటించారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు కరోనాపై పోరాటానికి తమవంతు విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని