పవన్‌ అడిగితే ఆ చిత్రం ఇచ్చేస్తానన్న చిరు!

తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌ అడిగితే తన చిత్రాన్ని ఇచ్చేస్తానంటున్నారట అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా

Updated : 07 Apr 2020 16:57 IST

హైదరాబాద్‌: తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌ అడిగితే తన చిత్రాన్ని ఇచ్చేస్తానంటున్నారట అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా ‘ఆచార్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చిరు చేయబోయే చిత్రంపై ఇప్పటికే స్పష్టత ఉంది. మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించిన ‘లూసిఫర్‌’ చిత్రాన్ని తెలుగులో చిరు రీమేక్‌ చేయనున్నారు. అయితే, ఎవరు దర్శకత్వం వహిస్తారన్న దానిపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘‘లూసిఫర్‌’ చిత్రాన్ని పవన్‌తో తీస్తారని టాక్‌ వినిపిస్తోంది. నిజమేనా’ అని ప్రశ్నించగా, ఆ చిత్రాన్ని తానే చేస్తానని అన్నారు. తనకోసమే ఆ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్నట్లు తెలిపారు. ఒకవేళ పవన్‌కు ఆ సినిమా చేయాలని ఆసక్తి ఉంటే, ఆ కథను తమ్ముడికి ఇస్తానని అన్నారు. మరి పవన్‌ ఏమంటారో చూడాలి. ఎందుకంటే పవన్‌ ప్రస్తుతం ‘వకీల్‌ సాబ్‌’తో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. దీనిని బట్టి చూసుకుంటే పవన్‌ కాల్షీట్లు ఈ ఏడాది ఖాళీ లేనట్లే.

మలయాళంలో మోహన్‌లాల్‌-పృథ్వీరాజ్‌లు కీలక పాత్రల్లో నటించిన ‘లూసిఫర్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో దీన్ని చిరంజీవి-రామ్‌చరణ్‌లతో తెరకెక్కిస్తారని టాక్‌ వినిపించింది. ఒక దశలో దర్శకుడు సుకుమార్‌ పేరు బాగా వినిపించింది. అయితే చిరు... కొరటాల సినిమా చేస్తుండటం, సుకుమార్‌.. బన్ని చిత్రం పట్టాలెక్కడంతో ప్రస్తుతానికి ఈ చర్చ ఆగిపోయింది. తాజాగా చిరు అన్న మాటతో ‘లూసిఫర్‌’ రీమేక్‌ మరోసారి వార్తల్లో నిలిచింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని