కరోనాపై సాయికుమార్‌ కుటుంబం షార్ట్‌ఫిలిం 

కరోనా దెబ్బకు ప్రపంచమంతా కకలావికలమవుతోంది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. సినీతారలు కూడా ఈ కష్టకాలంలో తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు.

Updated : 09 Apr 2020 20:57 IST

హైదరాబాద్‌: కరోనా దెబ్బకు ప్రపంచమంతా కకలావికలమవుతోంది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. సినీతారలు కూడా ఈ కష్టకాలంలో తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. విరాళాలతోపాటు తమదైన శైలిలో పాటలు, వీడియోల రూపంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. సినీ కార్మికుల సంక్షేమ కోసం ప్రముఖ నటుడు సాయికుమార్‌  ₹5లక్షలు, డబ్బింగ్‌ యూనియన్‌కు ₹2 లక్షలు విరాళం ప్రకటించారు. 

తాజాగా తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ఓ లఘుచిత్రం తీశారు. కరోనా  మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని వివరిస్తూ చేసిన షార్ట్‌ఫిలింకు మంచి స్పందన వస్తోంది. ఇందులో సాయికుమార్‌ పోలీసుగా.. ఆయకు కుమారుడు ఆది పారిశుద్ధ్య కార్మికుడిగా కనిపించగా.. కూతురు జ్యోతిర్మయి డాక్టర్‌గా కనిపించడం విశేషం. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ షార్ట్‌ పిలింను రూపొందించింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని