నిత్యావసరాల పంపిణీలో మాజీ సీఎం సతీమణి

కరోనా కల్లోలం రోజురోజూకీ దేశంలో అధికమౌతోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం ...

Updated : 13 Sep 2023 14:56 IST

బెంగళూరు: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా రోజువారీ కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి తమవంతుగా నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి బెంగళూరు సిటీ, పరిసర ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసర సరుకులను స్వయంగా వెళ్లి అందచేశారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ప్రాథమిక జాగ్రత్తల గురించి ఆమె అందరికీ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

రెండు టన్నుల కూరగాయల పంపిణీ..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని రెండు గ్రామల ప్రజలకు టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు కూరగాయలు అందజేశారు. శ్రీ విద్యానికేతన్‌ సిబ్బంది వీటిని గ్రామస్థులకు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని