సినీ కార్మికులకు రాజమౌళి ఆర్థిక సాయం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చారు. ఆయన, నిర్మాత దానయ్య కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం....

Updated : 10 Apr 2020 20:16 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చారు. ఆయన, నిర్మాత దానయ్య కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనవంతుగా సీసీసీకి రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే సీసీసీకి అనేక మంది టాలీవుడ్‌ ప్రముఖులు విరాళాలు అందించి, తమ మంచి మనసు చాటుకున్నారు.

 కరోనాతో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇటీవల విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు అందించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు.

* తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం సంఘం సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కును అందించారు.

* ‘యునైటెడ్‌ వే’ అనే ఆర్గనైజేషన్‌కు తనవంతు ఆర్థిక సాయం చేసినట్లు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఆర్గనైజేషన్‌ ద్వారా పేదలకు న్యూట్రీషియన్‌, శానిటైజర్‌ కిట్లు అందించినట్లు చెప్పారు. ‘మా వంతు మేం చేశాం.. మీరెందుకు చేయకూడదు. మనం ఇచ్చే చిన్న మొత్తం అంతా కలిస్తే చాలా పెద్దది అవుతుంది’ అని నాగ్‌ పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని