మీరే నిజమైన హీరోలు..!

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో వారి కుటుంబాలను వదులుకుని మన కోసం.. మన వారి కోసం నిద్రాహారాలు మానేసి ఎంతో శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులే నిజమైన హీరోలు అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్‌. దేశవ్యాప్తంగా....

Updated : 11 Apr 2020 15:44 IST

విక్టరీ వెంకటేశ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలను వదులుకుని మన కోసం.. మన వారి కోసం నిద్రాహారాలు మానేసి ఎంతో శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులే నిజమైన హీరోలు అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్‌. దేశవ్యాప్తంగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ.. ఇప్పటికే చిరంజీవి, మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపిన విషయం విధితమే. 

‘ఆస్పత్రిలో రోగుల ప్రాణాలను కాపాడటంలో తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యులు, కొవిడ్‌-19పై చేస్తున్న పోరాటంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న పోలీసులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం, మన కుటుంబాల కోసం కష్టపడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరే నిజమైన హీరోలు. మీ అందరికీ ఇదే నా సెల్యూట్‌.’ అని వెంకటేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని