పోలీసులకు శ్రీకాంత్‌ సాయం

కరోనా మహమ్మారి కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ ఆహారాన్ని పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకీ అధికమౌవుతోన్న నేపథ్యంలో దాని కట్టడి కోసం పోలీస్‌ యంత్రాంగం అన్నివిధాలుగా శ్రమిస్తుంది. ...

Published : 13 Apr 2020 10:45 IST

జర్నలిస్టులకు నిత్యావసరాలు అందించిన హరీశ్‌ శంకర్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించడమే కాకుండా తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ పోలీసులకు శానిటైజర్లు, ఆహారాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులకు, ఇతర సిబ్బందికి వీటిని అందించి క్లిష్ట సమయంలో పోలీసులు చేస్తున్న సేవలను శ్రీకాంత్‌ కొనియాడాడు. 

మరోవైపు టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సైతం కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అన్ని విధాలుగా అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 100 మంది పార్ట్‌టైమ్‌ జర్నలిస్టులకు ఆయన ఈ నిత్యావసరాలను అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని