మానవత్వాన్ని విడనాడకండి..!

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ మానవత్వంతో మెలగాలని టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్ అన్నారు. జంతువుల నుంచి వైరస్‌, పలు అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయనే అపోహల వల్ల చాలా మంది ప్రజలు తమ పెంపుడు...

Published : 15 Apr 2020 21:40 IST

ట్విటర్‌ వేదికగా వెంకటేశ్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ సృష్టిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ మానవత్వంతో మెలగాలని టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్ అన్నారు. జంతువుల నుంచి వైరస్‌, పలు అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయనే అపోహల వల్ల చాలా మంది ప్రజలు తమ పెంపుడు జంతువులను రోడ్లపై వదిలేస్తున్నారు. దీంతో అవి ఆకలితో రోడ్లపైనే మృతి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్‌ ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. పెంపుడు జంతువులను వదిలిపెట్టవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

‘మనుషులకే కాకుండా సమస్త ప్రాణకోటికి ఇది చాలా క్లిష్ట పరిస్థితి. జంతువుల వల్ల అంటువ్యాధులు వస్తాయనే అపోహలతో పలువురు తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు జంతువులను రోడ్లపై వదిలేస్తున్నారనే వార్తలు చదువుతుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. పెంపుడు జంతువుల వల్ల వ్యాధులు వ్యాప్తిస్తాయనేది అవాస్తవం అని ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచూరితమయ్యాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం మానవత్వాన్ని వదులుకోవద్దు. జంతువుల పట్ల ప్రేమను చూపించండి. ప్రతి ఒక్కరినీ ప్రేమించండి. త్వరలోనే ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం.’ అని వెంకటేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని