మనల్ని ప్రమాదం నుంచి తప్పించడం కోసం..!

ప్రమాదం నుంచి మనల్ని తప్పించడం కోసం తమ సొంతవాళ్లను సైతం వదిలిపెట్టి వచ్చి వీధుల్లో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కృతజ్ఞత తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన పలు ఫొటోలను ఓ ఫ్రేమ్‌లా చేసి..

Updated : 16 Apr 2020 18:41 IST

పారిశుద్ధ్య కార్మికులపై సూపర్‌స్టార్‌ ట్వీట్లు

హైదరాబాద్‌: ప్రమాదం నుంచి మనల్ని తప్పించడం కోసం తమ సొంతవాళ్లను సైతం వదిలిపెట్టి వచ్చి వీధుల్లో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అగ్రకథానాయకుడు మహేశ్‌ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన పలు ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ పలు ట్వీట్లు పెట్టారు. 

‘మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ఈ ట్వీట్‌. మనం మన ఇళ్లలో చాలా భద్రంగా ఉంటున్నాం. వాళ్లు మాత్రం తమ సొంతవాళ్లను వదులుకుని మనల్ని ప్రమాదం బారిన పడకుండా చేయడం కోసం రోజూ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. కంటికి కనిపించని భయంకరమైన వైరస్‌తో ప్రస్తుతం మనందరం ఎంతో పోరాటం చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన కోసం ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా గౌరవం, ప్రేమాభిమానంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ అని మహేశ్‌ ట్వీట్లు చేశారు.


కాలిబాటను క్లీన్‌ చేసిన చిరు

వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతోనే కరోనా వైరస్‌ను నియంత్రించగలమని మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తెలియజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలు వీడియోలను రూపొందించి నెటిజన్లతో పంచుకున్నారు. తాజాగా చిరు.. తన ఇంటి ఆవరణలోని కాలిబాటను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. మనం నడిచే కాలిబాటను కూడా ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని