జయహో పోలీస్‌: కోటి

‘జయహో పోలీస్‌.. యు ఆర్‌ ది వారియర్‌.. యు ఆర్‌ ది సేవియర్స్‌’.. అని అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. ఇటీవల కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ‘వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా’ అనే పాటను అలపించిన ఆయన తాజాగా పోలీసుల...

Published : 18 Apr 2020 11:11 IST

హైదరాబాద్‌: ‘జయహో పోలీస్‌.. యు ఆర్‌ ది వారియర్స్‌‌.. యు ఆర్‌ ది సేవియర్స్‌’.. అని అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. ఇటీవల కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ‘వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా’ అనే పాటను అలపించిన ఆయన తాజాగా పోలీసులపై ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మన సంక్షేమం కోసం తమ కుటుంబాలను వదులుకుని పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేస్తూ కోటి తనదైన శైలిలో పాట రూపంలో ధన్యవాదాలు తెలిపారు. ‘జయహో పోలీస్‌’ అంటూ సాగే ఈ పాటను తాజాగా సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని