‘మేటర్‌హార్న్‌’ని ఇలా చూస్తాననుకోలేదు

ప్రఖ్యాత ‘మేటర్‌హార్న్‌’ పర్వతాన్ని త్రివర్ణ పతాక కాంతుల్లో ఎప్పుడూ చూస్తాననుకోలేదని టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం చేస్తున్న అలుపెరగని పోరుకు స్విట్జర్లాండ్‌ సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే....

Published : 19 Apr 2020 14:21 IST

థ్యాంక్యూ స్విట్జర్లాండ్‌: అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: ప్రఖ్యాత ‘మేటర్‌హార్న్‌’ పర్వతాన్ని త్రివర్ణ పతాక కాంతుల్లో ఎప్పుడూ చూస్తాననుకోలేదని టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం చేస్తున్న అలుపెరగని పోరుకు స్విట్జర్లాండ్‌ సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్విస్‌ ఆల్ప్స్‌లోని ‘మేటర్‌హార్న్‌’ పర్వతంపై భారత జాతీయ జెండా కాంతులను కొద్దిసేపు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్‌.. భారత్‌కు సంఘీభావం ప్రకటించిన స్విట్జర్లాండ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. త్రివర్ణ పతాక కాంతుల్లో మెరుస్తున్న మేటర్‌హార్న్‌ పర్వతానికి సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

‘థ్యాంక్యూ స్విట్జర్లాండ్‌. కరోనా మహమ్మారి కట్టడి కోసం భారతదేశం చేస్తున్న పోరుకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు. మేటర్‌హార్న్‌ పర్వతాన్ని త్రివర్ణ పతాక కాంతుల్లో చూస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. మీరు సంఘీభావం ప్రకటించిన తీరు హృదయాలను హత్తుకుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని బన్నీ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని