రాజమౌళికి సవాలు విసిరిన ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు

‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి సవాలు విసిరారు. లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు సైతం ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి పని, వంట పని చేస్తూ చాలా మంది కనిపించారు. తాజాగా సందీప్ రెడ్డి....

Updated : 19 Apr 2020 15:22 IST

ఇంటి పని చేసి, వీడియో అప్‌లోడ్‌ చేయండి...

హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి సవాలు విసిరారు. లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు సైతం ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి పని, వంట పని చేస్తూ చాలా మంది కనిపించారు. తాజాగా సందీప్ రెడ్డి వంట సామాగ్రి తోముతూ, ఇల్లు శుభ్రం చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘పురుషుడు కూడా ఇంటి పనిని గొప్పగా చేయగలడు. నిజమైన పురుషుడు క్వారంటైన్‌ సమయంలోనూ ఇంటి భారాన్ని, పనిని పూర్తిగా మహిళపై వేయడు. దయచేసి ఇంటి పనిలో సాయం చేయండి. నిజమైన పురుషుడిలా ఉండండి. ఎస్‌.ఎస్‌. రాజమౌళి సర్‌.. మీరు కూడా ఇలాంటి వీడియోను అప్‌లోడ్‌ చేసి, అందరిలోనూ స్ఫూర్తి నింపాలని కోరుతున్నా’ అంటూ #BetheREALMAN ట్యాగ్‌ను ప్రారంభించారు.

సందీప్‌ రెడ్డి సవాలును రాజమౌళి స్వీకరించారు. ‘ఛాలెంజ్‌ స్వీకరిస్తున్నా సందీప్‌. ఇంటిలోని పనిని మనం కూడా పంచుకోవడం ఎంతో ముఖ్యం. నేను ఇంటి పనిచేస్తున్న వీడియోను రేపు అప్‌లోడ్‌ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని